బంజారాహిల్స్, ఏప్రిల్ 26: ఊబకాయం వల్ల మధుమేహ సమస్యలతో బాధపడుతున్న ముగ్గురు వ్యక్తులకు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్ వైద్యులు పూర్తి ఉపశమనం కల్పించారు. ట్రాన్స్ఫర్మేటివ్ సర్జరీతో వారిని మళ్లీ సాధారణ స్థితికి చేర్చారు. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాకు చెందిన వినీత్‌కుమార్ బన్సల్ (35), వినయ్‌కుమార్ బన్సల్ (35), మదన్చందర్ బారిక్ (45) ఊబకాయం వల్ల గత పదేండ్ల నుంచి మధుమేహం, రక్తపోటు, నిద్రలేమి, మోకాళ్ల నొప్పులు తదితర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల ఈ ముగ్గురు కేర్ హాస్పిటల్లో బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ వేణుగోపాల్ పరీక్ను సంప్రదించడంతో విజయవంతంగా ట్రాన్స్ఫర్మేటివ్ సర్జరీని పూర్తిచేశారు. ల్యాప్రోస్కోపిక్ విధానంలో నిర్వహించిన ఈ శస్త్రచికిత్స తర్వాత వారి ఊబకాయంతోపాటు ఇతర సమస్యలన్నీ తగ్గుముఖం పట్టాయని డాక్టర్ పరీక్ వెల్లడించారు.