హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): చర్లపల్లి సెంట్రల్ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ దశరథంపై బదిలీ వేటు పడింది. చర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలు (ప్రిజనర్స్ అగ్రికల్చరల్ కాలనీ)కు బదిలీ చేస్తూ జైళ్లశాఖ డీజీ జితేందర్ ఉత్తర్వులు జారీచేశారు. ఓ జీవిత ఖైదు పడిన ఖైదీ కుటుంబ సభ్యులతో అనుచితంగా ప్రవర్తించినట్టు అందిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరిపిన జైలు ఉన్నతాధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నట్టు తెలిసింది.