హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): జిల్లా పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తూ బదిలీ అయిన, పదోన్నతి పొందిన ప్రధానోపాధ్యాయుల జడ్పీ జీపీఎఫ్ ఖాతాల్లోని నగదును బదిలీ చేయాలని తెలంగాణ గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్(టీఎస్ జీహెచ్ఎంఏ) ప్రభుత్వాన్ని కోరింది. బదిలీ అయిన వారు తమ జీపీఎఫ్ ఖాతాలను ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లాలకు బదిలీచేసేందుకు దరఖాస్తు చేసుకున్నారని, జీపీఎఫ్ బదిలీచేయకపోవడంతో హెచ్ఎంలు ఇబ్బందిపడుతున్నారని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజగంగారెడ్డి, ప్రధాన కార్యదర్శులు గిరిధర్, కోశాధికారి తుకారం పేర్కొన్నారు. జీపీఎఫ్ బదిలీచేయకపోవడంతో ఇబ్బందులొస్తున్నాయని సో మవారం ప్రకటనలో ఆవేదన వ్యక్తంచేశారు.
బీసీల రిజర్వేషన్లపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలి
హైదరాబాద్, మార్చి31 (నమస్తే తెలంగాణ): బీసీల రిజర్వేషన్లపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖను రాశారు. బీసీలకు విద్యా, ఉపాధి, ఉద్యోగ, స్థానికసంస్థల్లో రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతూ అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుల అమలు కోసం.. బీసీ సంఘాలతోపాటు, విశ్రాంత న్యాయమూర్తులతో చర్చించాలని సూచించారు. జీవోలను జారీచేసి రిజర్వేషన్లను అమల్లోకి తేవాలని డిమాండ్ చేశారు.