డోర్నకల్ , మే 31 : సీతారామ ప్రాజెక్టు కెనాల్ పనుల్లో భాగంగా శనివారం గార్ల-డోర్నకల్ రైల్వే స్టేషన్ల మధ్య ఐసోలైట్ రాడ్ తగిలి ఓహెచ్ఈ (ఓవర్ హెడ్ ఎలక్ట్రిసిటీ లైన్ ) వైర్ ఎగువ లైన్లో సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తెగిపోయింది.
దీంతో తిరుపతి నుంచి ఆదిలాబాద్ వెళ్లే కృష్ణా ఎక్స్ప్రెస్ రైలు డోర్నకల్ రైల్వే స్టేషన్లో గంటపాటు నిలిచిపోయింది. లక్నో ఎక్స్ప్రెస్ రైలును 40 నిమిషాలు నిలిపివేశారు. రైల్వే అధికారులు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయడంతో రైళ్లు యథావిధిగా నడిచాయి.