హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఉన్నత విద్య ప్రమాణాల పెంపునకు ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకొన్నది. విశ్వవిద్యాలయాల్లోని సీనియర్ ఆచార్యులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని ఉన్న త విద్యామండలి కార్యాలయం లో నిర్వహించిన పాలక మం డలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు. సెప్టెంబర్ 20 నుంచి 22 వరకు జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్‌హెచ్చార్డీలో ఈ శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. సీనియర్ ఆచార్యులకు పరిపాలన, వర్తమాన ట్రెండ్స్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ వంటి అంశాల్లో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సహా ఇతర ప్రముఖ విద్యాసంస్థల నిపుణులు ఈ శిక్షణలో సూచనలు, సలహాలిస్తారు.