కాళేశ్వరం, మార్చి11 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టును శుక్రవారం ట్రైనీ సివిల్ సర్వీస్ అధికారులు సందర్శించారు. 2021 బ్యాచ్‌కు చెందన 17 మంది బృందం ముందుగా కాళేళ్వర- ముక్తీశ్వర స్వామి ఆలయానికి రాగా అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.
అక్కడ స్వామితోపాటు పార్వఇఇఅమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఆ తర్వాత లక్ష్మి పంప్‌హౌస్ వద్దకు వెళ్లారు. మ్యాప్, డిజిటల్ డిస్ప్లే ద్వారా ఇంజినీర్లు ప్రాజెక్టు గురించి వివరించారు. అక్కడి నుంచి లక్ష్మీ బరాజ్, సరస్వతీ బరాజ్‌ను సందర్శించారు. ఈ బృందంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఏఎస్లతోపాటు జడ్పీ సీఈవో శోభారాణి, ఎంపీవో ప్రసాద్ తదితరులు ఉన్నారు.