హైదరాబాద్ నగర ప్రజలకు ట్రాఫిక్జామ్ నిత్యం నరకం చూపిస్తున్నది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో నగరజీవిని ట్రాఫిక్ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. నాలుగైదు కిలోమీటర్ల దూరం వెళ్లాలన్నా గంటల తరబడి ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకోవాల్సి వస్తున్నది.
బంపర్ టు బంపర్ వాహనాన్ని నడపాల్సి ఉంటున్నది. సాయంత్రం చలివేళల్లో చిన్నపిల్లలతో ద్విచక్ర వాహనంపై అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వస్తే జ్వరం, సర్ది బారిన పడాల్సి వస్తున్నది. బీఆర్ అంబేద్కర్ సచివాలయం సమీపంలో శనివారం రాత్రి ఈ చిత్రం కనిపించింది.