షాద్ నగర్ రూరల్: షాద్‌నగర్ పట్టణంలోని చటాన్‌పల్లి (Chatanpally) రైల్వేగేట్ వద్ద మరమ్మతులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం నుంచి ఆదివారం (6 నుంచి 9వ తేదీ వరకు) వరకు నాలుగు రోజులపాటు రాకపోకలు నిలిపివేయినట్లు రైల్వే అధికారులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ రహదారుల్లో వెళ్లాలని సూచించారు.
చటాన్‌పల్లి గేట్ నుంచి చటాన్‌పల్లి, బైపాస్ రోడ్డు, బుచ్చిగూడ, దూసకల్, వెల్జర్ల, సంగెం, కొత్తపేట తదితర గ్రామాల ప్రజలు ప్రతిరోజూ వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు.