సంగారెడ్డి : అక్రమ మద్యంపై రాష్ట్ర పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తూ మద్యం అక్రమ రవాణాను కట్టడి చేస్తున్నారు. తాజాగా చిరాగ్ పల్లి లోని తెలంగాణ- కర్ణాటక చెక్ పోస్టు వద్ద కర్ణాటక మద్యాన్ని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందుతులు ట్రావెల్స్ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో అక్రమంగా తెలంగాణకు తరలిస్తుండగా ఎక్సైజ్ శాఖ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కర్ణాటకకు చెందిన 26 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని నిందితులపై కేసు నమోదు చేశారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా మద్యం సరఫారా చేసినా, కలిగియున్న కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.