హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను టీపీసీసీ చీఫ్ రేవంత్ అవమానించారని టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జరగనున్న కాంగ్రెస్ పార్టీ సభ ఎజెండాను సోనియాగాంధీ ప్రకటిస్తారని రేవంత్ పేర్కొనడమే అందుకు నిదర్శనమని తెలిపారు.
ఆ పార్టీ అధ్యక్షుడైన ఖర్గేకు బదులుగా సోనియా చేత విధాన ప్రకటన చేయిస్తానని పేర్కొనడం దళితులపై వివక్షకు తార్కాణమని తెలిపారు. అసలు దళితులపై కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏమిటని రేవంత్‌ను ప్రశ్నించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకే న్యాయం దక్కకపోతే ఆ పార్టీ దళిత సమాజానికి ఏం మేలు చేస్తుందని ప్రశ్నించారు. దళితుల పట్ల రేవంత్ వైఖరిని ఆ వర్గాలు అర్థం చేసుకోవాలని కోరారు.