హైదరాబాద్, జూన్ 12(నమస్తే తెలంగాణ): జర్మనీలో ఉద్యోగం చేయాలనుకునే నర్సింగ్ అభ్యర్థులకు ఆ దేశభాషలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్టు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్(టామ్‌కామ్) ప్రకటించింది. అర్హులైన అభ్యర్థులు ఈనెల 15లోగా తమ వెబ్సైట్(టామ్‌కామ్) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఎంపికైన అభ్యర్థులకు జర్మనీలో నర్సింగ్ ఉద్యోగం లభిస్తుందని పేర్కొం ది. 21-38ఏండ్లు ఉండి, గుర్తింపు పొందిన కాలేజీ నుంచి నర్సింగ్, ఐసీ యూ, జెరియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, నియోనాటల్, సర్జికల్, సైకియాట్రిక్ లో కనీసం 1-3 ఏండ్ల అనుభవం ఉన్నవారు, వివరాలకు 63022 92450, 99088 30438, 84999 90304 నంబర్లను సంప్రదించాలి.