హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ చార్జీలను పెంచినట్టు ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థ తెలిపింది. 2025-26 సంబంధించి ఔటర్ టోల్ చార్జీలను స్వల్పంగా పెంచుతున్నట్టు వెల్లడించింది. పెరిగిన చార్జీలు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయని పేర్కొన్నది. వివి ధ రకాల వాహనాలను ఆరు క్యాటగిరీలుగా విభజించి టోల్ చార్జీలను నిర్ణయించింది. కారు, జీపు, వ్యాన్ లైట్ వెహికిల్స్ ప్రతి కిలోమీటర్‌కు రూ.10పైసలు పెం చగా, మినీబస్, ఎల్ వాహనాలకు ప్రతి కిలో మీటర్‌కు రూ. 20 పైసలు పెం చింది. దీంతో ఈ టోల్ చార్జీ రూ.2.34 నుంచి రూ.2.44కు పెరిగింది. మినీబస్, ఎల్సీవీలకు కిలో మీటర్‌కు రూ.3.77 నుంచి రూ.3.94కు పెంచా రు. 2 యా క్సిల్ బస్సులకు కిలో మీటర్‌కు రూ.6.69 నుంచి రూ.7కు పెంచారు. భారీ సైజు వాహనాలకు కిలోమీటర్ రూ.15.09 నుంచి రూ.15.78కు పెంచింది.
గ్రోత్ కారిడార్ నిర్వహణకే ..
కొత్త టోల్ రేట్లు, నెలవారీ, రోజువారీ పాసులకు సంబంధించిన చార్జీల వివరాలను హెచ్ఎండీఏ వెబ్ సంప్రదించవచ్చని సూచించింది. హెచ్ఎండీఏ పరిధిలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ నిర్వహణలో ఉండే ఓఆర్ఆర్ ఐఆర్ సంస్థ 30 ఏండ్ల కాలానికి లీజుకు తీసుకున్నది.