హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): జాబ్ క్యాలెండర్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్లో ‘విద్యార్థి నిరుద్యోగ మహాగర్జన’ చేపడుతున్నట్టు నిరుద్యోగులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
జాబ్ క్యాలెండర్ ప్రకారం వివిధ శాఖల్లో ఉద్యోగాలు ఎక్కడ అని మండిపడ్డారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల భర్తీ, మెగా డీఎస్సీ, పోలీసు, గ్రూప్స్ నియామకాలు ఎక్కడ? అని వారు ప్రశ్నించారు.