హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): చేయూత పింఛన్లకు దరఖాస్తులు ఈనెల 9న ప్రారంభం కాగా, ఆఖరి గడువు సోమవారంతో ముగియనున్నది. పింఛన్ల కోసం ఇప్పటి వరకు 3,03,066 మంది దరఖాస్తు చేసుకున్నారు. సెప్టెంబర్ 1నుంచి క్షేత్రస్థాయి పరిశీలన చేసిన తర్వాత అర్హులను ఎంపిక చేయనున్నారు. అయితే ఆన్లైన్లో సాంకేతిక కారణాలు, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యంతో వేలాదిమంది దరఖాస్తు చేయలేదని తెలుస్తున్నది. దీంతో గడువును మరికొంత కాలం పొడిగించాలనే డిమాండ్ వినిపిస్తున్నది.