హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : భూగర్భ జల వనరుల శాఖలో 32 గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువు మంగళవారం ముగియనున్నది. 25 నాన్గెజిటెడ్ పోస్టులకు మాత్రం బుధవారం వరకు చాన్స్ ఉన్నది. రాష్ట్రంలోని భూగర్భ జల వనరుల శాఖలో 57 ఉద్యోగాల భర్తీకి ఈ ఏడాది నవంబర్ 29న టీఎస్పీఎస్సీ రెండు వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చిన విషయం తెలిసిందే. వివరాలకు https://www.tspsc. gov.inలో సంప్రదించవచ్చును.