హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించేందుకు ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ నెల 24న రాజేంద్రనగర్ క్యాంపస్‌లో విత్తనమేళాను నిర్వహించనున్నది. దీనితోపాటు జగిత్యాల, పాలెం, వరంగల్ మూడు ప్రాంతీయ ్యవసాయ పరిశోధనా స్థానాలు, కృషి విజ్ఞాన కేంద్రాల్లోనూ విత్తనమేళా నిర్వహించనున్నామని, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఈ మేళాను ప్రారంభిస్తారని వర్సిటీ పరిశోధనా విభాగం సంచాలకులు డాక్టర్ వెంకటరమణ వెల్లడించారు. ఈ మేళాలో 10 రకాల పంటలకు చెందిన 45 రకాల విత్తనాలతోపాటు పశుగ్రాస విత్తనాలు, జీవ ఎరువులు విక్రయానికి అందుబాటులో ఉంటాయని తెలిపారు. వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించిన ప్రదర్శన నిర్వహించడంతోపాటు ఆధునిక వ్యవసాయ సాంకేతికతలపై రైతుల సందేహాలను తీర్చేందుకు శాస్త్రవేత్తలతో చర్చాగోష్ఠి నిర్వహించనున్నట్టు వివరించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వరిలో సన్న రకాలు: ఆర్ఎన్ఆర్ 15048, డబ్ల్యూజీఎల్-44, డబ్ల్యూజీఎల్-962, కేఎన్ఎం-1638, జేజీఎల్-28545, జేజీఎల్-27356, ఆర్ఎన్ఆర్-2465, ఆర్ఎన్ఆర్-11718, బీపీటీ-5204, కేపీఎస్-2874.
వరిలో దొడ్డు రకాలు: కేఎన్ఎం-118, ఎమ్‌టీయూ-1010, డబ్ల్యూజీఎల్-915, జేజీఎల్-24423.
వరిలో సువాసన కలిగి ఉండే రకం: ఆర్ఎన్ఆర్-15435.
మొకజొన్న హైబ్రీడ్ రకాలు: డీహెచ్ఎం-117, డీహెచ్ఎం-121, కరీంనగర్ మక-1.
ఆముదం: పీసీహెచ్-111.
పెసర: యాదాద్రి (డబ్ల్యూజీజీ-42), ఎంజీజీ-295, ఎంజీజీ-347, ఎంజీజీ-351, ఎంజీజీ-385, బీపీఎం-2-14.
మినుము: పీయూ-31, టీబీజీ-104, ఎల్బీజీ-752, ఎంబీజీ-1070,
వీబీఎన్-8, జీబీజీ-1.
కంది: హనుమ, డబ్యూఆర్జీఈ- 97, డబ్ల్యూఆర్‌జీ-255, పీఆర్జీ-176, ఎంఆర్జీ-1004, ఎంఆర్జీ-66,
టీడీఆర్జీ-59.
జొన్న: పీవైపీఎస్-2, సీఎస్వీ-41.
సోయా చికుడు: బాసర, కేడీఎస్-726, ఎంఏయూఎస్-612, ఏఐఎస్బీ-15.