హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : మెరుగైన ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించాలని టీఎన్జీవో డిమాండ్ చేసింది. టీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రా్రష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలు విడుదల చేయాలని, హెల్త్‌కార్డుల అమల్లో లోపాలు సవరించి పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని కోరారు.
సీపీఎస్ రద్దు చేయాలని.. సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ.. అదే రోజు అన్ని జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న భాగ్యనగర్ టీఎన్జీవో ఇండ్ల స్థలాల సమస్యలు పరిష్కరించాలని తీర్మానం చేశారు.