హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : నల్లగొండ, వరంగల్, ఖమ్మం నియోజకవర్గం నుంచి టీచర్ ఎమ్మెల్సీగా బరిలో ఉన్న పూల రవీందర్‌కు తెలంగాణ మాడల్ స్కూ ల్ టీచర్స్ అసోసియేషన్ (టీఎంఎస్టీఏ) మద్దతు పలికింది. రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు పూల రవీందర్‌ను కలిసి మద్దతు లేఖను అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంతం నగేశ్, సహ అధ్యక్షుడు ధనుంజయ్, రవీందర్‌గౌడ్, ఆంజనేయులు, స్వామి తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): గురుకులాల్లో మ్యూజిక్ టీచర్ల భర్తీకి 27, 28,30 తేదీల్లో డెమో నిర్వహిస్తున్నట్టు ట్రిబ్ చైర్మన్ సైదులు తెలిపారు. మంగళవారం ప్రకటన విడుదల చేశారు. మాసాబ్‌ట్యాంక్‌లోని డీఎస్ఎస్ భవన్లో రోజూ రెండు సెషన్స్‌లో అభ్యర్థులకు డెమో నిర్వహిస్తామని తెలిపారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన అభ్యర్థులు ట్రిబ్ వెబ్సైట్లో తమ షెడ్యూల్‌ను పరిశీలించుకోవాలని, ఆయా తేదీల్లో హాజరు కావాలని సూచించారు.