హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): తిరుపతిలో రద్దీ ప్రాంతాల్లో బాంబు, డాగ్ స్కాడ్లతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. తమిళనాడులో రాజకీయ, సినీ ప్రముఖులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అందులో తిరుపతి పేరు కూడా ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది.
ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రైల్వేస్టేషన్, లింకు బస్టాండ్, విష్ణునివాసం తదితర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం తనిఖీలు చేపట్టారు. ప్రమాదకర వస్తువులు దొరకకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.