ఎంఎస్ఎంఈలకు టీఐహెచ్‌సీఎల్ ఆసరా

నష్టాల్లో ఉన్న 135 పరిశ్రమల పునరుద్ధరణ
రూ.100 కోట్ల ఆస్తులు, 2 వేల మంది ఉపాధి పదిలం
హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): నష్టాల్లో కూరుకుపోయిన, మూతపడిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లను కాపాడేందుకు కృషిచేస్తున్న తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ లిమిటెడ్ (టీఐహెచ్‌సీఎల్) రాష్ట్రవ్యాప్తంగా 135 ఎంఎస్ఎంఈలను విజయవంతంగా ఆదుకున్నది. దీంతో రూ.100 కోట్ల విలువైన ఆస్తులు వేలానికి వెళ్లకుండా చూడటంతోపాటు దాదాపు 2 వేలమంది ఉపాధి నిలబడింది. బ్యాంకుల నుంచి సకాలంలో రుణాలు అందకపోవడం, ముడిసరుకు లభ్యతలో ఇబ్బందులు, యంత్రాలు సరిగా పనిచేయకపోవడం, విద్యుత్తు సరఫరాలో సమస్యలు, సరుకు తీసుకున్నవారు చెల్లింపులు జరపకపోవడం తదితర కారణాలతో అనేక ఎంఎస్ఎంఈలు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. రుణ వాయిదాలను చెల్లించలేకపోతుండటంతో ఇలాంటి ఎంఎస్ఎంఈలను బ్యాంకులు సీజ్‌చేసి వాటి ఆస్తులను వేలం వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 250 ఎంఎస్ఎంఈలు టీఐహెచ్‌సీఎల్‌ను సంప్రదించాయి. వాటి నష్టాలకు గల కారణాలను సమగ్రంగా అధ్యయనం చేసిన అధికారులు.. 135 ఎంఎస్ఎంఈలు తిరిగి కోలుకునే విధంగా తగిన సహకారం అందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

