కొల్లాపూర్ రూరల్ ; నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నల్లమల అటవీ ప్రాంతానికి చెందిన అమరగిరి చెంచుగూడెం పరిసరాల్లో చీమలతిప్పకు వెళ్లే నది ఒడ్డున సోమవారం పెద్దపులి కనిపించడంతో జాలర్లు ఉలిక్కిపడ్డారు. భయపడుతూనే దానిని తమ సెల్ఫోన్లలో చిత్రీకించారు. విషయాన్ని జాలర్లు కొల్లాపూర్ ఫారెస్టు రేంజ్ శరత్చంద్రారెడ్డికి తెలియజేశారు. ఆయన తన బృందంతో ఘటనా స్థలానికి చేరుకొని పులి కదిలికలను, పాదముద్రలను సేకరించారు. పరిసర ప్రాంతాల్లో కెమెరాలను ఏర్పాటు చేశారు. రెండు నెలల నుంచి పెద్దపులులు నదీ తీరాన్ని దాటుతూ ఆంధ్రప్రదేశ్ టైగర్ జోన్ నుంచి అమ్రాబాద్ టైగర్ జోన్లోకి వస్తున్నట్టు నిర్ధారించారు.