Tigers | హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్-శ్రీశైలం రిజర్వ్ ఫారెస్ట్‌లో అటవీశాఖ అధికారులు కెమెరా ట్రాప్ ద్వారా మూడు పులుల జాడను గుర్తించారు. ఇందులో ఒక ఆడపులి, రెండు పులిపిల్లలు ఉన్నట్టుగా గుర్తించామని ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా డీఎఫ్‌వో రామచంద్రరావు తెలిపారు. వీటిని వెల్దుర్తి మండలం లోయాపల్లి ఫారెస్ట్‌లో గుర్తించామని, ప్రస్తుతం జనావాసాలకు దూరంగా సంచరిస్తున్నాయని వివరించారు. ఇవి నాగార్జునసాగర్ రిజర్వ్‌లోకి వెళ్లే అవకాశం ఉన్నదని చెప్పారు. ప్రస్తుతం నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో 75 పులులు ఉన్నట్టు అటవీశాఖ అధికారులు వెల్లడించారు.