హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): జేఈఈ అడ్వాన్స్డ్-2025 ఫలితాల్లో తమ విద్యార్థులు మరోసారి అధిపత్యం కనబర్చినట్టు శ్రీచైతన్య విద్యాసంస్థల సీఈవో, అడకమిక్ డైరెక్టర్ సుష్మ తెలిపారు. ఆలిండియా ఫస్ట్ ర్యాంకుతోపాటు ఓపెన్ క్యాటగిరీలో 3, 5, 6, 11 ర్యాంకులు కైవసం చేసుకున్నట్టు వెల్లడించారు. వంగాల అజయ్‌రెడ్డి 300లకు 300 మార్కులతో ఆలిండియా మొదటి ర్యాంకు సాధించినట్టు తెలిపారు. ఓబీసీ క్యాటగిరీలో డీజీ రుత్విక్‌సాయి ఆలిండియా ఫస్ట్ ర్యాంకు, ఓపెన్ క్యాటగిరీలో మాజిద్ హుస్సేన్ 3, ఉజ్వల్ కేసరి 5, అక్షత్ కుమార్ 6, అర్నవ్ నిగమ్ 11, దేవ్‌దత్తా మాఘీ 16, రుత్విక్‌సాయి 18 కైవసం చేసుకున్నట్టు వివరించారు.