TS EAMCET | టీఎస్ ఎంసెట్‌కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. గత ఆరేండ్లలో ఎన్నడూ రాని దరఖాస్తులు.. ఈ ఏడాది వచ్చినట్లు ఎంసెట్ కన్వీనర్ వెల్లడించారు. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు ఇంజినీరింగ్( Engineering ) కోర్సులకు 1,95,515 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. అగ్రికల్చర్( Agriculture ), మెడికల్( Medical ) కోర్సుల్లో ప్రవేశాలకు 1,08,457 దరఖాస్తులు రాగా, ఇంజినీరింగ్, మెడికల్, అగ్రికల్చర్ కోర్సులకు కలిపి 333 దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా 3,05,185 దరఖాస్తులు వచ్చినట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డాక్టర్ డీన్ కుమార్ తెలిపారు.
తెలంగాణ వ్యాప్తంగా ఇంజినీరింగ్ కోర్సులకు 1,47,861 దరఖాస్తులు, అగ్రికల్చర్, మెడికల్ కోర్సులకు 90,672 దరఖాస్తులు వచ్చాయి. ఏపీ నుంచి ఇంజినీరింగ్ కోర్సులకు 48,911 దరఖాస్తులు రాగా, అగ్రికల్చర్, మెడికల్ కోర్సులకు 19,635 దరఖాస్తులు వచ్చినట్లు ఎంసెట్ కన్వీనర్ పేర్కొన్నారు.