ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో మూడు రోజులపాటు నిర్వహించనున్న ఉత్సవాలను మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు.
తెలంగాణ పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజ రామయ్యార్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, పర్యాటక సంచాలకురాలు నిఖిల, పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.