హైదరాబాద్, జూలై21 (నమస్తే తెలంగాణ): కేరళ మాజీ సీఎం, కమ్యూనిస్టు యోధుడు వీఎస్ అచ్యుతానందన్ మృతి వామపక్ష పార్టీలకు తీరని లోటని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ, రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, పార్టీ నేతలు చాడ వెంకట్రెడ్డి, తక్కలపల్లి శ్రీనివాసరావు, పల్లా వెంకట్రెడ్డి, పశ్యపద్మ పేర్కొన్నారు.
ఈ మేరకు సోమవారం వారు సంతాప ప్రకటన విడుదల చేశారు. బడుగు, బలహీన వర్గాల కోసం జీవితాంతం పోరాడిన అచ్యుతానందన్ కేరళలో వామపక్ష ప్రభుత్వానికి సమర్థవంతంగా నాయకత్వం వహించి, అన్ని వర్గాల ప్రజల మన్ననలను పొందారని వారు కొనియాడారు.