హాస్టల్లో చదివిన ఈటలకు వేల కోట్లెక్కడివి?

- విచారణకు పీఏపీఎస్ అధ్యక్షుడి డిమాండ్
- కొత్తపల్లిలో సెల్‌టవర్ ఎక్కి నిరసన
హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): మంత్రి ఈటల రాజేందర్ ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలని, ఐటీ దాడులు చేయాలని ప్రజా ఆరోగ్య పరిరక్షణ సంఘం (పీఏపీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు తిప్పారపు సంపత్ డిమాండ్ చేశారు. పేదరికంతో హాస్టల్లో చదువుకున్న రాజేందర్‌కు అతితక్కువ సమయంలో వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఈటల రాజేందర్‌ను మంత్రిపదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ హుజూరాబాద్ పట్టణ పరిధిలోని కొత్తపల్లిలో సెల్‌టవర్ ఎక్కి నిరసన తెలిపారు. మంత్రి ఈటలపై పలు ఆరోపణలు చేస్తూ సంపత్ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘హుజూరాబాద్ నియోజకవర్గంలో పేదలకు ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కూడా కట్టించలేదు. కానీ ఆయనకు ఢిల్లీలో ఒక ఇల్లు, వందల ఎకరాల్లో కోట్ల రూపాయల విలువైన ఫాంహౌస్, తన కూతురుకు జూబ్లీహిల్స్‌లో కొత్త ఇల్లు, కమలాపూర్‌లో ఇల్లు ఉండగా, హుజూరాబాద్‌లో ఇల్లు కట్టడానికి అర ఎకరంలో భూమి పూజ కూడాచేశాడు. రోడ్ల అభివృద్ధి పేరుతో కాంట్రాక్టర్ల నుంచి కోట్ల రూపాయలు కమిషన్ తీసుకున్నారు’ అని తెలిపారు. మంత్రి పదవి నుంచి ఈటలను తొలగించారని తెలవడంతో సంపత్ తనంతట తానే టవర్ దిగి వచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

