హైదరాబాద్, సెప్టెంబర్4 (నమస్తే తెలంగాణ) : కుల వివక్షకు పాల్పడే వారిని దేశద్రోహులుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కుల నిర్మూలన వేదిక అధ్యక్షుడు నాగరాజు బుధవారం ఎస్సీ, ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్యను కలిసి వినతిపత్రం అందజేశారు. రియల్ఎస్టేట్ పేరుతో ఎస్సీ, ఎస్టీల భూముల ఆక్రమణ, కుల బహిషరణ, లైంగికదాడులకు తెగబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుల వివక్షకు పాల్పడిన వారిని దేశద్రోహులుగా ప్రకటించేలా పార్లమెంట్లో చట్టం చేసేలా ప్రభుత్వానికి సిఫారసు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ములుగు రూరల్, సెప్టెంబర్ 4: ‘పీఎం కిసాన్ న్యూ రిజిస్ట్రేషన్ కేవైసీ’ పేరుతో వాట్సప్‌లో వస్తున్న లింక్‌తో మొబైల్స్ హ్యాక్ అవుతున్నాయి. వారం రోజులుగా వాట్సప్‌లోని గ్రూప్‌ల ద్వారా ఈ యాప్ వివరాలు వస్తున్నాయి. కొందరు పీఎం కిసాన్ కేవైసీ అనుకొని వివరాలు నమోదు చేసే క్రమంలో మొబైల్లోని ఇతర వాట్సప్ గ్రూపుల్లోకి యాప్ లింక్ ఫార్వర్డ్ అవుతున్నది. మొబైల్లోని వ్యక్తిగత డాటాతోపాటు బ్యాంకు అకౌంట్లు, పిన్ నంబర్లు, ఫోన్‌పే, గూగూల్‌పే వంటి యాప్‌ల పాస్వర్డ్లు దొంగిలించేందుకు కారణంగా నిలుస్తున్నది.