తొర్రూరు, జనవరి 6 : రేషన్ బియ్యం పట్టుబడిన కేసులో వ్యాపారిని తొర్రూరు సీఐ డబ్బులు డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులు దర్యాప్తు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా దం తాలపల్లి మండలంలో 2024 అక్టోబర్ 2న రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేసి సీజ్ చేశారు. సీజ్ చేసిన లారీని విడిచి పెట్టేందుకు తొర్రూరు సీఐ జగదీశ్ బియ్యం వ్యాపారిని రూ.5 లక్షలు డిమాండ్ చేసినట్టు ఆరోపణలున్నాయి. వ్యాపారి రూ.2 లక్షలు 2024 అక్టోబర్ 3న అందజేయగా, మరో రూ. 3 లక్షల కోసం సీఐ డిమాండ్ చేయడంతో బియ్యం వ్యాపారి ఏసీబీని ఆశ్రయించగా, విచారించిన అధికారులు సీఐ జగదీశ్ అవినీతి ఆరోపణలు నిర్ధారించుకొని సీఐపై కేసు నమోదు చేసి వరంగల్‌కు తరలించారు.