హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా అటవీరంగంలో వస్తు న్న మార్పులకు అనుగుణంగా ఫారెస్ట్ గ్రాడ్యుయే ట్స్ అవగాహన పెంచుకోవాలని ఆబర్న్ యూనివర్సిటీ డీన్ డాక్టర్ జానకీరామ్రెడ్డి అలవలపాటి సూచించారు. హైదరాబాద్లోని తెలంగాణ ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను మంగళవారం ఆయన సందర్శించారు. అటవీరంగంలో ప్రపంచవ్యాప్త ధోరణి, పురోగతి గురించి విద్యార్థులు, అధ్యాపకులతో చర్చించారు. విదేశీ ఫారెస్ట్ విద్యలో మాస్టర్స్ ప్రోగ్రాం కొనసాగించడానికి సలహాలు అందించారు. ఫ్యాకల్టీ ఎక్సేం జ్ ప్రోగ్రాం, విద్యార్థుల ఇంటర్న్షిప్ వంటి విషయాలపైనా చర్చించారు. ఎఫ్సీఆర్ఐ డీన్ ప్రియాంక వర్గీస్, జాయింట్ డైరెక్టర్ పీ శ్రీనివాసరావు, డిప్యూటీ డైరెక్టర్ ఏ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.