హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్ష సజావుగా ముగిసింది. గురు, శుక్రవారాల్లో ఆన్లైన్లో ఈ పరీక్షను హైదరాబాద్లోని రెండు కేంద్రాల్లో నిర్వహించారు. క్లాస్-ఏలో 170, క్లాస్-బీలో 15 ఉద్యోగాలకు 1,172 మంది దరఖాస్తు చేసుకొన్నారు. క్లాస్-ఏ ఉద్యోగాలకు ఉదయం పేపర్-1 పరీక్షకు 835 మంది హాజరయ్యారు. పేపర్-2ను 810 మంది రాశారు. 14న క్లాస్-బీ ఉద్యోగాల నియామక పరీక్షకు 103 మంది హాజరయ్యారు.