UGC | తెలంగాణలో ఫేక్ వర్సిటీల్లేవ్.. జాతీయ స్థాయిలో యూజీసీ నకిలీ వర్సిటీల జాబితా
తెలంగాణ రాష్ట్రంలో ఫేక్ యూనివర్సిటీలు లేవని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తాజాగా ప్రకటించింది. రాష్ట్రంలో నిరుడు సైతం ఒక్క నకిలీ యూనివర్సిటీ లేకపోగా, ఈ ఏడాదీ వాటికి చోటులేదని అధికారికంగా ప్రకచించింది.
- జాతీయంగా 20 ఫేక్ యూనివర్సిటీలు
- ఢిల్లీలో 8, యూపీ 4, ఏపీ 3, బెంగాల్లో 2
- ఈ ఏడాది వివరాలు వెల్లడించిన యూజీసీ
UGC | హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రంలో ఫేక్ యూనివర్సిటీలు లేవని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తాజాగా ప్రకటించింది. రాష్ట్రంలో నిరుడు సైతం ఒక్క నకిలీ యూనివర్సిటీ లేకపోగా, ఈ ఏడాదీ వాటికి చోటులేదని అధికారికంగా ప్రకచించింది. జాతీయ స్థాయిలో నకిలీ వర్సిటీల జాబితాను యూజీసీ తాజాగా విడుదల చేసింది. రాష్ర్టాల వారీగా చూస్తే దేశ రాజధాని ఢిల్లీలో అత్యధికంగా 8 ఫేక్ వర్సిటీలు ఉన్నట్టు తేలింది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌లో 4, పశ్చిమబెంగాల్లో 2, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 ఫేక్ యూనివర్సిటీలు ఉన్నాయి.
కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పుదుచ్చేరిలో ఒక్కోటి చొప్పున ఉన్న ఫేక్ వర్సిటీల జాబితాను యూజీసీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆయా వర్సిటీలపై చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ రాష్ర్టాల ఉన్నత విద్యామండళ్లు, రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శులకు యూజీసీ లేఖలు రాసింది. చెల్లని డిగ్రీలను ప్రదానం చేస్తున్న ఫేక్ విద్యాసంస్థలు, వర్సిటీలకు షోకాజ్ నోటీసులు జారీచేస్తామని యూజీసీ వర్గాలు హెచ్చరించాయి. నకిలీ వర్సిటీల్లో ప్రవేశాలు పొందే సమయంలోనే విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని యూజీసీ హెచ్చరించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

