హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 21 : రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం శుక్రవారం నుంచి టీజీ ఐసెట్ -2025 కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం సర్టిఫికెట్ వెరిఫికేషన్ శుక్రవారం నుంచి వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ హెల్ప్‌లైన్ సెంటర్లో నిర్వహించనున్నట్టు ప్రిన్సిపాల్ డాక్టర్ బైరి ప్రభాకర్ తెలిపారు.
ఫేజ్ షెడ్యూల్-1 ఆన్లైన్ ఫైలింగ్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు అండ్ స్లాట్ బుకింగ్ 20 నుంచి 28 వరకు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఈనెల 22 నుంచి 29 వరకు (27న మినహాయించి), ఆప్షన్ ఎంట్రీ ఈనెల 25 నుంచి 30 వరకు, ఆప్షన్ ఫ్రీజింగ్ ఈనెల 30న, సీట్ల ప్రొవిజనల్ అలాట్మెంట్ సెప్టెంబర్ 2వ తేదీలోపు, ట్యూషన్ ఫీజు చెల్లింపు, రిపోర్టింగ్ వచ్చే నెల 2 నుంచి 5వ తేదీ వరకు ఉంటుందని పేర్కొన్నారు.
తుది విడత షెడ్యూల్ ఆన్లైన్ ఫైలింగ్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు అండ్ స్లాట్ బుకింగ్ వచ్చే నెల 8 నుంచి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ 9వ తేదీ నుంచి, ఆప్షన్ ఎంట్రీ 9, 10వ తేదీల్లో, ఆప్షన్ ఫ్రీజింగ్ 10న, సీట్ల ప్రొవిజనల్ అలాట్మెంట్ 13లోపు, ట్యూషన్ ఫీజు చెల్లింపు, స్వీయ రిపోర్టింగ్ 13 నుంచి 15వ తేదీ వరకు, అలాట్ అయిన కాలేజీల్లో రిపోర్టింగ్ 15, 16వ తేదీల వరకు, స్పాట్ అడ్మిషన్స్ (ఎంబీఏ, ఎంసీఏ, ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజీల్లో) 15వ తేదీ నుంచి ఉంటుందని తెలిపారు. టీజీఐసెట్ గైడ్‌లైన్స్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.