Home
Telangana
The Telangana Governments Prestigious Second Phase Of Kantivelugu Program Has Crossed The Milestone Of 100 Working Days
ఘనంగా కంటివెలుగు శతదినోత్సవం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటివెలుగు కార్యక్రమం 100 పనిరోజుల మైలురాయిని దాటింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సచివాలయంలో శనివారం కంటివెలుగు శతదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
- నూతన సచివాలయంలో సంబురాలు
- కేక్ కట్ చేసి వైద్యసిబ్బందికి శుభాకాంక్షలు
- వేడుకల్లో పాల్గొన్న పలువురు మంత్రులు
హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటివెలుగు కార్యక్రమం 100 పనిరోజుల మైలురాయిని దాటింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సచివాలయంలో శనివారం కంటివెలుగు శతదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, సహచర మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో కలిసి కేక్ కట్ చేశారు. పథకం దిగ్విజయంగా 100 రోజులు పూర్తి చేసుకోవటంపై మంత్రి హరీశ్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. ఆశావరర్లకు కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. కంటివెలుగు విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు వైద్యారోగ్యశాఖ సహా సహకరించిన ఇతర శాఖలు, ప్రజా ప్రతినిధులకు మంత్రి హరీశ్‌రావు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అలోచనతో రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘కంటివెలుగు’ కార్యక్రమం 100 రోజుల పనిదినాలను పూర్తి చేసుకోవడంతోపాటు, లక్ష్యానికి మించి కంటిపరీక్షలు నిర్వహించిందని తెలిపారు. నివారింపదగిన, అంధత్వరహిత తెలంగాణ లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న ఈ కార్యక్రమం ఎంతోమందికి కంటివెలుగును ప్రసాదించిందని కొనియాడారు. ఎవరూ అడగక ముందే ఈ పథకం ప్రారంభించి, మానవత్వాన్ని చాటుకున్న గొప్ప మనసు సీఎం కేసీఆర్‌ది అని, గ్రామాలకు వైద్యసిబ్బంది వచ్చి, ఉచితంగా పరీక్షలు నిర్వహించి, అద్దాలు అందించే కార్యక్రమం ప్రపంచంలో తెలంగాణలో మినహా మరెకడా లేదని కొనియాడారు. కంటి వెలు గు సంబురాల్లో వైద్యారోగ్యశాఖ సెక్రటరీ రిజ్వీ, హెల్త్ కమిషనర్ శ్వేతా మహంతి, డీహెచ్ శ్రీనివాసరావు, టీవీవీపీ కమిషనర్ అజయ్‌కుమార్, టీఎస్ఎంఎస్ ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, కంటివెలుగు ప్రోగ్రాం ఆఫీసర్ స్వరాజ్యలక్ష్మి, ఆరోగ్యశాఖ అధికారులు, ఆశా, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

