మహనీయుల పోరాటం స్ఫూర్తిదాయకం.. ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
హైదరాబాద్ విముక్తి కోసం మహనీయులు చేసిన పోరాటాన్ని నేటితరం స్ఫూర్తిగా తీసుకోవాలని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ సూచించారు. ఈ మేరకు గురువారం సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. భారత స్వాతంత్య్ర చరిత్రలో 17 సెప్టెంబర్, 1948కి ప్రత్యేక స్థానం ఉన్నదని గుర్తుచేశారు.
- పరేడ్‌గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన దినోత్సవం
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ విముక్తి కోసం మహనీయులు చేసిన పోరాటాన్ని నేటితరం స్ఫూర్తిగా తీసుకోవాలని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ సూచించారు. ఈ మేరకు గురువారం సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. భారత స్వాతంత్య్ర చరిత్రలో 17 సెప్టెంబర్, 1948కి ప్రత్యేక స్థానం ఉన్నదని గుర్తుచేశారు. ‘హైదరాబాద్ విమోచన దినోత్సవం’ అనేది కేవలం ఒక చరిత్రాత్మక ఘట్టంగా స్మరించుకోవడం మాత్రమే కాదని, దేశ నిర్మాణ ప్రస్థానాన్ని గుర్తుచేసుకునే సందర్భమని పేర్కొన్నారు.
ఈ పోరాటంలో అనేక మంది మహనీయుల త్యాగాలు, ధైర్యసాహసాలు ఇమిడి ఉన్నాయని తెలిపారు. అంతకుముందు పోలీసు అమరవీరుల స్మృతి స్తూపం వద్ద నివాళులర్పించారు. జాతీయ జెండా ఎగురవేశా రు. వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహానికి నివాళులర్పించారు. పరేడ్‌గ్రౌండ్‌లో తెలంగాణ కళారూపాలు, వేయి స్తంభాల గుడి, బతుకమ్మ శకటాలను ప్రదర్శించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, కిషన్‌రెడ్డి, బండి సం జ య్, ఎంపీ ఈటల పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

