ప్రజలకు సుపరిపాలన అందించేందుకే కలెక్టరేట్ల నిర్మాణం
మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్రంలో ప్రజలకు సుపరిపాలనను మరింత చేరువ చేసేందుకే నూతన కలెక్టరేట్లను నిర్మిస్తున్నామని పంచాయతీ రాజ్, శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు.

వరంగల్ అర్బన్ : రాష్ట్రంలో ప్రజలకు సుపరిపాలనను మరింత చేరువ చేసేందుకే నూతన కలెక్టరేట్లను నిర్మిస్తున్నామని పంచాయతీ రాజ్, శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. హన్మకొండలో సిద్ధమవుతున్న నూతన సమీకృత కలె క్టరేట్ భవనాన్ని రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి మంత్రి పరిశీలించారు.
ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 21న జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటనలో భాగంగా నూతనంగా నిర్మిస్తున్న వరంగల్ అర్బన్ కలెక్టరేట్ కాంప్లెక్స్ ను లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. అదే విధంగా 24 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణానికి కూడా భూమి పూజ చేస్తారని మంత్రి తెలిపారు. వరంగల్ అర్బన్ కలెక్టరేట్ భవనానికి 35 కోట్ల రూపాయల తో అంచనాలు రూపొందించగా.. దాదాపు 57 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయం అయినట్లు తెలిపారు.
ఈ కలెక్టరేట్ కాంప్లెక్స్ మొత్తం దాదాపు ఒక లక్షా 57 వేల అడుగుల విస్తీర్ణం కలిగి ఉందని వివరాలను వెల్లడించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని నిర్మిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం, అభివృద్ది కోసమే చిన్న జిల్లాల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ రాష్ట్రంగా తీర్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు.
కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, సీసీఎఫ్ ఆశ, డీఎఫ్ఓ అర్పన, డీఆర్వో వాసు చంద్ర, ఆర్ అండ్ బీ ఎస్ఈ. నాగేందర్ రావు అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
విద్య ద్వారానే సమాజంలో మార్పు : ఎమ్మెల్సీ కవిత
రైతు బంధు పథకం దేశానికే ఆదర్శం
శ్రీలంక పర్యటనకు కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ఖరారు
పల్లె ప్రగతి పెండింగ్ పనులు 19 లోపు పూర్తి చేయాలి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

