హైదరాబాద్, నవంబర్ 4(నమస్తే తెలంగాణ): అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ(ఆస్కీ)తో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(సెయిల్) ఒప్పందం కుదుర్చుకున్నది. సెయిల్‌లో కొత్తగా పదోన్నతి పొందిన ఎగ్జిక్యూటివ్‌ల మేనేజ్ మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌ల నిర్వహణ కోసం ఈ ఒప్పంద చేసుకున్నది. ఈ మేరకు సోమవారం ఇరు సంస్థల అధికారులు ఒప్పందంపై సంతకాలు చేశారు.
హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): అవయవదానం ప్రక్రియను పర్యవేక్షించే జీవన్‌దాన్ కార్యక్రమానికి నోడల్ ఆఫీసర్‌గా డాక్టర్ శ్రీభూషణ్ రాజు నియమితులయ్యారు. ఈ మేరకు వైద్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీభూషణ్ రాజు ప్రస్తుతం నిమ్స్‌లో నెఫ్రాలజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.