వేములవాడ టౌన్, అక్టోబర్ 19: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామివారిని శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీవిధుశేఖరభారతి మహాస్వామి ఆదివారం రాత్రి దర్శించుకున్నారు. ఆలయంలో వారికి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలుకగా ఆలయ ప్రాంగణంలోని కోటిలింగాలను దర్శించుకున్నారు. ఆలయ విస్తీర్ణానికి సంబంధించిన ప్రణాళికలతో ఉన్న మ్యాప్‌ను పరిశీలించారు.
ఆలయ ఓపెన్ స్లాబ్‌పై అనుగ్రహ భాషణం చేశారు. ధర్మవిజయ యాత్రలో భాగంగా వేములవాడకు వచ్చిన శృంగేరి పీఠాధిపతికి మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, కలెక్టర్, రాజన్న ఆలయ స్థానాచార్యుడు నమిలకొండ ఉమేశ్, బ్రాహ్మణులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు.