Home
Telangana
The Social Boycott Of The Gowda And Sc Communities Is Atrocious Strict Action Must Be Taken Against Those Responsible Cpm State Secretary John Wesley
గౌడ, ఎస్సీల సాంఘిక బహిషరణ దారుణం
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో 39 గౌడ కుటుంబాలు, 11 ఎస్సీ కుటుంబాలను గ్రామ అభివృద్ధి కమిటీ సాంఘిక బహిషరణ చేయడం దుర్మార్గమని, ఘటన జరిగి 17 రోజులు గడుస్తున్నా చర్యలు తీసుకోకపోవడం దారుణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విమర్శించారు.
ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకొని, బాధిత కుటుంబాలకు ప్రాణ, ఆస్తి రక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గౌడ్ల జీవనాధారమైన ఈతవనం కాల్చివేసినందున వారికి నష్టపరిహారం చెల్లించాలని శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. వీడీసీ సభ్యులు అడిగిన 6 లక్షలు వారికి ఇవ్వనందుకే పాతకక్షలను ముందుకు తెచ్చి ఈ సాంఘిక బహిషరణ చేశారని ఆరోపించారు. వీరిని సాంఘిక బహిషరణ చేయడం ఇది రెండోసారి అని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గౌడ, ఎస్సీల సాంఘిక బహిషరణ దారుణం
12న మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశం.. ఎల్ నినో ఎఫెక్ట్, వర్షాభావ పరిస్థితులపై చర్చించే అవకాశం
ఫుడ్ పాయిజన్ ఘటనపై సుమోటో కేసు.. నివేదిక ఇవ్వాలని హెచ్ఆర్సీ చైర్పర్సన్ షమీమ్ అక్తర్ ఆదేశం
అపార్ట్మెంట్ ఎనోవోసీకి 24 మీటర్ల పరిమితి.. ఫైర్ డీజీ విక్రమ్‌సింగ్ మాన్ వెల్లడి
మరో పోరుకు నాంది పలుకుదాం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

