ఖైరతాబాద్, జూలై 10 : నిరుద్యోగులపై ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ విద్యార్థుల రాజకీయ పార్టీ (వీఆర్పీ) ఆధ్వర్యంలో సచివాలయాన్ని బుధవారం ముట్టడించారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు యెచ్చు శ్రీనివాస్ నేతృత్వంలో విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో సచివాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని పలువురిని అరెస్ట్‌చేశారు. గ్రూప్-2, 3 పోస్టుల పెంపు, డీఎస్సీ వాయిదా, 25వేల పోస్టులతో మెగా డీఎస్సీ డిమాండ్లతో కొన్నిరోజులుగా ధర్నాలు, నిరసన చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమని విద్యార్థి నేతలు వా పోయారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని నిరుద్యోగ భృతి రూ.4వేలు అందించాలని, జీవో 46 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వీఆర్పీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇజ్జగిరి కమలాకర్, పాక నవీన్ బాబు, సాత్వికారెడ్డి, మహేశ్, అనికేత్, అనిల్‌కుమార్, నరేశ్ పాల్గొన్నారు.