Pharma | హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): బీ ఫార్మసీ, ఫార్మా-డీ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ సోమవారం నుంచి ప్రారంభంకానుంది. సోమవారం ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పించగా, మంగళవారం సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను చేపడతారు.
ఈ నెల 5, 6న వెబ్ ఆప్షన్లను, 9న సీట్లు కేటాయిస్తారు. వివరాలకు https:// tgeapcetb. nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన తెలిపారు.