కోటిన్నరకు చేరువలో కంటి వెలుగు
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మార్గదర్శకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగుతున్నది.
- రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న పరీక్షలు
- 20 లక్షల 69 వేల మందికి రీడింగ్ గ్లాసెస్
హైదరాబాద్, మే14 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మార్గదర్శకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగుతున్నది. జనవరి 18 నుంచి జూన్ 15 వరకు వంద రోజులపాటు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు 85 శాతానికిపైగా కంటి పరీక్షలు పూర్తి అయ్యాయి. ఆదివారం నాటికి 74 రోజుల పనిదినాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఒక కోటి 42 లక్షల 30 వేల 576 మందికి కంటి పరీక్షలను నిర్వహించారు. దృష్టి లోపమున్న వారిని గుర్తించి 20 లక్షల 69 వేల మందికి ఉచితంగా కండ్లద్దాలు, మందులను అందజేశారు. మొత్తంగా 10 వేల 285 గ్రామపంచాయతీ వార్డుల్లో, 3,221 మున్సిపల్ వార్డుల్లో కంటి పరీక్షలు పూర్తయినట్టు అధికారులు వెల్లడించారు.
దగ్గరిచూపు సమస్యలే అధికం
అన్ని జిల్లాల్లో దగ్గరిచూపు కనిపించక ఇబ్బందిపడే వారే అధికంగా ఉన్నట్టు పరీక్షల్లో తేలింది. 40 ఏండ్ల వయస్సు పైబడిన చాలామందికి దగ్గర చూపు కనిపించడం లేదని శిబిరానికి వస్తున్నారు. అలాంటి వారికి తక్షణమే రీడింగ్ గ్లాసెస్ అందజేస్తున్నారు. అవి కాకుండా కంటి సమస్యలతో వస్తున్న చాలా మందికి చుకల మందుతోపాటు విటమిన్ ఏ, డీ, బీ కాంప్లెక్స్ టాబ్లెట్లు పంపిణీ చేస్తున్నారు. 50 ఏండ్లు పైబడిన వారు అత్యధికంగా మోతబిందు (కాటరాక్ట్) సమస్యతో బాధపడుతున్నారు. శస్త్రచికిత్స అవసరమైన వారికి చికిత్స చేసే సమయాన్ని చరవాణి ద్వారా సమాచారం చేరవేస్తున్నామని వైద్య సిబ్బంది చెప్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

