హనుమకొండ చౌరస్తా, జూన్ 29: ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం 2023-24 విద్యాసంవత్సరానికి నిర్వహించిన ఐసెట్ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. గురువారం కాకతీయ విశ్వవిద్యాలయం కామర్స్ సెమినార్ హాల్లో ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, ఐసెట్ చైర్మన్, కేయూ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్, కన్వీనర్ ప్రొఫెసర్ వరలక్ష్మి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ శ్రీనివాసరావు సమక్షంలో ఫలితాలను ప్రకటించారు.
ఈ సందర్భంగా ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి మాట్లాడుతూ.. మొత్తం 75,925 ఐసెట్ దరఖాస్తులు రాగా, 70,900 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా, వీరిలో 61,092 మంది (86.17%) అర్హత సాధించినట్టు చెప్పారు. వీరిలో పురుషులు 29,618 మంది, మహిళలు 31,473 మం ది, ట్రాన్స్‌జెండర్ ఒకరు ఉన్నట్టు చెప్పారు. వచ్చేనెలలో కౌన్సెలింగ్ ఉంటుం దని తెలిపారు. వివరాలు conve nor. icet@ tsche.ac.inలో చూడవచ్చని అన్నారు.