హైదరాబాద్, అక్టోబర్12 (నమస్తే తెలంగాణ): పదేండ్లలో తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేలా అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దులుగా ముందుకు తీసుకెళ్లిన సీఎం కేసీఆర్ నాయకత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రతి ఒకరితో మమేకమయ్యేలా పార్టీ ప్రచారం నిర్వహించాలని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలకు సూచించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ సీనియర్ నాయకులను ఆయా అసెంబ్లీల ఇన్చార్జిలుగా నియమించారు.
54 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి బీఆర్ఎస్ ఇన్చార్జిల తొలి విడత జాబితాను కేటీఆర్ గురువారం విడుదల చేశారు. అనంతరం పార్టీ ఇన్చార్జిలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల విజయానికి అనుసరించాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కు సానుకూల వాతావరణం ఉన్నదని చెప్పారు. పదేండ్లలో బీఆర్ఎస్ సర్కారు చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లి వారిని ఓట్లు అడగాలని సూచించారు.
ప్రతిపక్ష పార్టీలకు ఎన్నికలు కేవలం హామీలు ఇచ్చేందుకు వేదికలు మాత్రమేనని, బీఆర్ఎస్ పార్టీకి మాత్రం పదేండ్లలో చేసిన ప్రగతిని ప్రజలకు వివరించే ఒక అద్భుతమైన అవకాశమని తెలిపారు. అసెంబ్లీలవారీగా ఇన్చార్జిలుగా నియమితులైన ప్రతిఒక నాయకుడు ఇప్పటినుంచే పార్టీ విజయానికి అవసరమైన కార్యాచరణ, కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. రేపటి నుంచి ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు వరకూ ఆయా నియోజకవర్గాల సంపూర్ణ బాధ్యతను తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ శ్రేణులన్నింటిని సమన్వయం చేసుకొని, పార్టీ ప్రచార బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుందని చెప్పారు.
బీఆర్ఎస్ గెలుపుకోసం శ్రమించాలి: మంత్రి హరీశ్‌రావు
టెలికాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు పార్టీ ఇన్చార్జిలకు పలు సలహాలు, సూచనలు అందించారు. రాబోయే 5 రోజులపాటు నియోజకవర్గంలోనే ఉంటూ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో బూత్ కమిటీల నిర్వహణ మొదలుకొని నియోజకవర్గస్థాయి వరకు అన్ని దశల్లో పార్టీ ప్రచారం పకడ్బందీగా ఉండేలా సమగ్ర ప్రణాళిక రూపొందించుకొని అమలు చేయాలని తెలిపారు ఇన్చార్జిలుగా కార్యకర్తలు చేపట్టాల్సిన కార్యక్రమాలపైన ప్రత్యేకంగా మాట్లాడారు. తమకు బాధ్యత అప్పజెప్పిన కార్యక్షేత్రంలో పదేండ్లలో జరిగిన మంచి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు పోవాలని సూచించారు. ఎన్నికల్లో పార్టీ ఘనవిజయం సాధిస్తుందని తెలిపిన హరీశ్‌రావు.. ఆ దిశగా ఈ 45 రోజులపాటు విస్తృతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ ఎలక్షన్ క్యాంపెయిన్ నియోజకవర్గ ఇన్చార్జిల జాబితా
నియోజకవర్గం : ఇన్చార్జి పేరు
1. బెల్లంపల్లి (ఎస్సీ) : వెంకటేశ్ నేత (ఎంపీ)
2. మంచిర్యాల : భానుప్రసాద్‌రావు (ఎమ్మెల్సీ)
3. ఖానాపూర్ (ఎస్టీ) : దండె విఠల్ (ఎమ్మెల్సీ)
4. బోథ్ (ఎస్టీ) : నగేశ్ (మాజీ ఎంపీ)
5. ముధోల్ : పురాణం సతీశ్‌కుమార్ (మాజీ ఎమ్మెల్సీ)
6. బోధన్ : కల్వకుంట్ల కవిత (ఎమ్మెల్సీ)
7. ఎల్లారెడ్డి : వీ గంగాధర్‌గౌడ్ (మాజీ ఎమ్మెల్సీ)
8. కామారెడ్డి : గంప గోవర్ధన్ (ఎమ్మెల్యే), శేరి సుభాశ్‌రెడ్డి (ఎమ్మెల్సీ), మంత్రి కేటీఆర్ (ఇన్చార్జి)
9. నిజామాబాద్ అర్బన్ కల్వకుంట్ల కవిత (ఎమ్మెల్సీ)
10. జగిత్యాల : ఎల్ రమణ (ఎమ్మెల్సీ), రాజేశంగౌడ్ (మాజీ మంత్రి)
11. రామగుండం : నారదాసు లక్ష్మణ్ (మాజీ ఎమ్మెల్సీ)
12. మంథని : ఈద శంకర్‌రెడ్డి (మాజీ చైర్మన్)
13. పెద్దపల్లి : రవీందర్‌సింగ్ (చైర్మన్)
14. చొప్పదండి (ఎస్సీ) : గంగుల కమలాకర్ (మంత్రి)
15. వేములవాడ : బీ వినోద్‌కుమార్ (మాజీ ఎంపీ)
16. మానకొండూరు (ఎస్సీ) : జీవీ రామకృష్ణ (సుడా చైర్మన్)
17. మెదక్ : టీ తిరుపతిరెడ్డి (మెదక్)
18. ఆందోల్ (ఎస్సీ) : ఫారూఖ్ హుస్సేన్ (మాజీ ఎమ్మెల్సీ)
19. నర్సాపూర్ : వెంకట్రాంరెడ్డి (ఎమ్మెల్సీ)
20.జహీరాబాద్ (ఎస్సీ) : దేవీప్రసాద్ (మాజీ చైర్మన్)
21.సంగారెడ్డి : వీ భూపాల్‌రెడ్డి (చైర్మన్), ఎర్రోళ్ల శ్రీనివాస్ (చైర్మన్)
22. దుబ్బాక : బాలమల్లు (చైర్మన్)
23.గజ్వేల్ హరీశ్‌రావు (మంత్రి), : డాక్టర్ యాదవరెడ్డి (ఎమ్మెల్సీ), వీ ప్రతాప్‌రెడ్డి (చైర్మన్)
24.మల్కాజిగిరి : శంభీపూర్ రాజు (ఎమ్మెల్సీ)
25.ఉప్పల్ రావుల : శ్రీధర్‌రెడ్డి (చైర్మన్)
26. ఇబ్రహీంపట్నం : తీగల కృష్ణారెడ్డి (మాజీ ఎమ్మెల్యే)
27. చేవెళ్ల (ఎస్సీ) : రంజిత్‌రెడ్డి (ఎంపీ)
28. వికారాబాద్ (ఎస్సీ) : రంజిత్‌రెడ్డి (ఎంపీ)
29. ముషీరాబాద్ : ఎంఎస్ ప్రభాకర్ (ఎమ్మెల్సీ)
30. అంబర్‌పేట : కట్టెల శ్రీనివాస్‌యాదవ్, మోహన్‌రావు (అడ్వొకేట్)
31.సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ) : తలసాని శ్రీనివాస్‌యాదవ్ (మంత్రి)
32. మక్తల్ : ఆంజనేయగౌడ్ (చైర్మన్)
33. గద్వాల్ : రాకేశ్ చిరుమళ్ల (మాజీ చైర్మన్)
34. అలంపూర్ (ఎస్సీ) : చల్లా వెంకట్రాంరెడ్డి (ఎమ్మెల్సీ)
35. అచ్చంపేట (ఎస్సీ) : ఇంతియాజ్ ఇషాక్ (చైర్మన్)
36. కల్వకుర్తి : గోలి శ్రీనివాస్‌రెడ్డి (చైర్మన్)
37.కొల్లాపూర్ : పీ రాములు (ఎంపీ)
38.నాగార్జునసాగర్ : కోటిరెడ్డి (ఎమ్మెల్సీ), రామచంద్రునాయక్
39. హుజూర్నగర్ : విజయసింహారెడ్డి (నల్లగొండ)
40. కోదాడ : టీ రవీందర్రావు (ఎమ్మెల్సీ)
41. నల్లగొండ : బండా నరేందర్‌రెడ్డి (జడ్పీ చైర్మన్)
42.నకిరేకల్ (ఎస్సీ) : బడుగుల లింగయ్యయాదవ్ (ఎంపీ)
43.జనగామ : బీ వెంకటేశ్వర్లు (మాజీ ఎమ్మెల్సీ), డాక్టర్ రాజయ్య (చైర్మన్), హరీశ్‌రావు (ఇన్చార్జి)
44.మహబూబాబాద్ (ఎస్టీ) : సత్యవతి రాథోడ్ (మంత్రి)
45. నర్సంపేట : వీ ప్రకాశ్ (చైర్మన్)
46. వరంగల్ ఈస్ట్ : బండా ప్రకాశ్ (మండలి డిప్యూటీ చైర్మన్)
47. భూపాలపల్లి : బస్వరాజు సారయ్య (ఎమ్మెల్సీ)
48. ములుగు (ఎస్టీ) : పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (ఎమ్మెల్సీ)
49. ఇల్లెందు (ఎస్టీ) : వద్దిరాజు రవిచంద్ర (ఎంపీ)
50. మధిర (ఎస్సీ) : పువ్వాడ అజయ్‌కుమార్ (మంత్రి), కొండబాల కోటేశ్వరరావు
51. వైరా (ఎస్టీ) : నామా నాగేశ్వరరావు (ఎంపీ)
52. సత్తుపల్లి (ఎస్సీ) : పార్థసారథిరెడ్డి (ఎంపీ)
53. అశ్వారావుపేట (ఎస్టీ) : శేషగిరిరావు (డీసీఎంఎస్ ఖమ్మం)
54. భద్రాచలం (ఎస్టీ) : తాతా మధు (ఎమ్మెల్సీ)