మహిళా, శిశు సంక్షేమ శాఖ పనితీరు అద్భుతం : మంత్రి సత్యవతి
మంత్రి సత్యవతి | తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖ పని చేస్తున్నట్లుగా దేశంలోనే మరెవరు చేయడం లేదని గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

మహబూబాబాద్ : తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖ పని చేస్తున్నట్లుగా దేశంలోనే మరెవరు చేయడం లేదని గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మహిళలు, శిశువుల ఎదుగుదల, ఆరోగ్య పరిరక్షణలో మనం అద్భుతంగా పని చేస్తున్నామని పేర్కొన్నారు. గర్భిణులు, బాలింతలు, శిశువులకు సరైన పోషకాహారం అందజేసి పోషకాహార లోపాన్ని సంపూర్ణంగా నివారించడం, వారి సమగ్ర ఎదుగుదల కోసం రూపొందించిన పోషణ మాసం కార్యక్రమాన్ని జిల్లాలోని గుమ్మనూరు రైతు వేదికలో మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళలు, శిశువుల ఎదుగుదల, ఆరోగ్య పరిరక్షణలో మనం అద్భుతంగా పని చేయగలుగుతున్నాం. ఇటీవలే కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీని కలిసి గడువు ముగుస్తున్న పోషణ అభియాన్ కొనసాగించాలని కోరామన్నారు. వారు దానికి వెంటనే అంగీకరించారని మంత్రి తెలిపారు.
గుజరాత్ రాష్ట్రంలోని కేవడియాలో అంగన్వాడీ సేవలను పటిష్టం చేసేందుకు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ జాతీయ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. అక్కడ మన రాష్ట్రం తరపున శాఖ కార్యదర్శి దివ్య దేవరాజన్ వెళ్లి మన దగ్గర చేపడుతున్న పథకాల గురించి చెప్పినప్పుడు చాలా ప్రశంసలు లభించాయని గుర్తు చేశారు.

బాల్య వివాహాలను బలవంతంగా ఆపితే ఆగవని గుర్తించిన సీఎం కేసిఆర్ కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చి, కచ్చితంగా 18 ఏళ్లు నిండిన వారికే వర్తింప జేస్తున్నారు. దీంతో చాలా వరకు బాల్య వివాహాలు తగ్గాయన్నారు. ఆరోగ్య లక్ష్మి పథకం కింద గర్భిణులు, బాలింతలకు పోషకాహారాన్ని అందిస్తున్నామని తెలిపారు.
కేంద్రం సహకరించకపోయినా అంగన్వాడీల సేవలు గుర్తించి తెలంగాణ వచ్చాక మూడుసార్లు వేతనాలు పెంచుకున్నాం. కేంద్రం 2700 రూపాయలు ఇస్తుంటే మనం 13,650 రూపాయలు ఇస్తున్నామని తెలిపారు. ఐసీడీఎస్ ప్రాజెక్టులలో గిరి పోషణ ద్వారా ఆదిమ గిరిజనులకు ఎక్కువ పోషకాలు ఇచ్చే కార్యక్రమం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
మన రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలను దేశంలో అందరూ ప్రశంసిస్తున్నారని తెలిపారు. మన మానుకోటలో మహిళా, శిశు సంక్షేమ శాఖ చేసే కార్యక్రమాల గురించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసించే విధంగా మనం పని చేయాలని సూచించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్, సర్పంచ్‌లు ఎన్. పద్మ, బొడశ్రీను, భరత్, గుగులోతు పద్మ ఎంపీటీసీ నరేష్, టి.ఆర్.ఎస్ నేతలు నూకల రంగారెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, మన్యు, నాగన్న, కొప్పుల వెంకట్ రెడ్డి, సుందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Manjira River : మంజీరా నదిలో చిక్కుకున్న వందలాది గొర్రెలు
భూమ్మీద సూర్యుడు అస్తమించని ఆ ఆరు ప్రాంతాలేవో తెలుసా?
Srsp Project : శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

