హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): దేశంలో ఆన్లైన్ లెర్నింగ్ క్రేజీ ఏమాత్రం తగ్గడం లేదు. ఒకవైపు ఆఫ్‌లైన్‌లో ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్నా.. కరోనా పరిస్థితుల నుంచి బయటపడ్డా.. ఇంకా మనవాళ్లు ఆన్లైన్ చదువులనే అమితంగా ఇష్టపడుతున్నారు. 2022 జనవరి నుంచి 2023 డిసెంబర్ మధ్యకాలంలో ఆన్లైన్ ఎన్రోల్మెంట్స్ 27 లక్షలకు పెరిగినట్టు ఫిజిక్స్‌వాలా సంస్థ తేల్చింది.
ఆన్లైన్ లెర్నింగ్ వేదిక ‘ఫిజిక్స్‌వాలా’ సంస్థ ఆన్లైన్ చదువులపై అధ్యయన వివరాలను వెల్లడించింది. కరోనా తర్వాత ఆన్లైన్ లెర్నింగ్ పట్ల ఆసక్తిచూపుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్టు సంస్థ విశ్లేషించింది.