హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి కోసం గత అసెంబ్లీ స మావేశాల్లో కొత్తగా తీసుకొచ్చిన ‘టూరిజం పాలసీ 2025-30’ అటకెక్కింది. ఈ పాలసీ అమలులో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు సంబంధిత శాఖ మంత్రి, అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. వచ్చే ఐదేండ్లలో రూ. 15వేల కోట్ల పెట్టుబడులు రాబట్టి, రాష్ట్రంలో సంపద సృష్టిస్తామన్న ప్రభుత్వం.. ఇప్పుడు ఆ ఊసే ఎత్త డం లేదు. దీంతో 6 నెలల్లో కనీసం నయాపైసా పెట్టుబడి కూడా రాలేదు. అసలు రాష్ట్రంలో టూరిజం పాలసీ ఉన్నదో లేదో అర్థం కావడం లేదు.
టూరిజం పాలసీ ద్వారా ప్రైవేటు వ్యక్తులు, సంస్థల నుంచి పెట్టుబడులు ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్న రేవంత్‌రెడ్డి సర్కారు.. తెలంగాణలో టెంపుల్ టూరిజం, ఏకో టూరిజం, మెడికల్ అండ్ వెల్నెస్ టూరిజం, స్పిరుచ్యువల్ టూరిజం, స్పోర్ట్స్ టూ రిజాన్ని అభివృద్ధి చేస్తామంటూ ప్రగల్భాలు పలికింది. కానీ, వాటిలో ఒక్క దానిపై కూడా దృష్టి పెట్టకపోవడం గమనార్హం.
కొత్తగా టూరిజం పాలసీ ద్వారా 3 లక్షల మంది యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కార్.. ఇప్పుడు మొండి చేయి చూపింది. ఇప్పటివరకు పర్యాటక రంగంలో ఒక్కరికి కూడా ఉపాధి కల్పించిన దాఖలాలు లేవు. ప్రజాపాలనంటూ ప్రగల్భాలు పలుకుతున్న సీఎం రేవంత్‌రెడ్డి పూర్తిగా అబద్ధాలు చెప్పేందుకే పరిమితమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
టూరిజం పాలసీ తీసుకొచ్చి చేతు లు దులుపుకొన్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు అయోమయంలో పడ్డారు. పర్యాటక రంగంలోకి పెట్టుబడులను ఏ విధం గా రాబట్టాలో తెలియక మల్లగుల్లా లు పడుతున్నారు. పెట్టుబడులను ఆ కర్షించేందుకు సర్కారు నుంచి సహకారం అందడంలేదన్నారు.