ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి | సారంగాపూర్ మండలం ప్యారముర్ గ్రామంలో రూ. 50 లక్షల వ్యయంతో చేపట్టిన సాయి బాబా ఆలయ అభివృద్ధి పనులకు దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

నిర్మల్ : సారంగాపూర్ మండలం ప్యారముర్ గ్రామంలో రూ. 50 లక్షల వ్యయంతో చేపట్టిన సాయి బాబా ఆలయ అభివృద్ధి పనులకు దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని సాయి బాబాను దర్శించుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..రాష్ట్రంలోని దేవాలయాలు సీఎం కేసీఆర్ కృషితో ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు.
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ పునర్నినిర్మాణం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. జిల్లాలో కొలువై ఉన్న బాసర జ్ఞానసరస్వతీ అమ్మవారి దేవాలయ అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను, కామన్ గుడ్ ఫండ్ నిధులతో ఇతర ఆలయాల జీర్ణోద్ధరణ, దేవాలయాల నిర్మాణ పనులు చేపడుతున్నామన్నారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా దేవాలయాలకు నిధులు మంజూరు చేస్తూ అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రాంగణంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మొక్కలు నాటారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

