శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 22, 2020 , 01:05:58

ఎలాంటి సమస్య వచ్చినా ఆదుకుంటాం

ఎలాంటి సమస్య వచ్చినా ఆదుకుంటాం

  • ప్రజలకు మంత్రి గంగుల భరోసా

కరీంనగర్‌ కార్పొరేషన్‌: ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ భరోసా ఇచ్చారు. గురువారం కరీంనగర్‌ జిల్లాకేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే నగరపాలక సంస్థలో కరోనా కట్టడి కోసం చేపట్టిన సేవలపై రూపొందించిన వీడియోను మేయర్‌ సునీల్‌రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో ఒకేసారి నగరంలో 8 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, సీఎం కేసీఆర్‌ ఆదేశాలో తామంతా ప్రజల మధ్య లో ఉండి పనిచేశామన్నారు. కొందరు మాత్రం హైదరాబాద్‌ పారిపోయారని ఎద్దేవా చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలతోనే కలిసి ఉన్నామని, బల్దియా ప్రజాప్రతినిధులు కూడా సొంతంగా తమవంతు సహకారాన్ని ప్రజలకు అందించారని గుర్తుచేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పూర్తిస్థాయిలో బాధ్యతాయుతంగా పనిచేయడంతోనే నగరంలో కరోనాను కట్టడి చేయగలిగామన్నారు. ఇప్పటికి కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం అశ్రద్ధ చూపినా మరోసారి వైరస్‌ ప్రబలే అవకాశం ఉన్నదని హెచ్చరించారు. ప్రభుత్వం సూచించిన భౌతికదూరం, పరిశుభ్రతను పాటిస్తూ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 


logo