హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్యకు కారణమైన రేవంత్ బ్రదర్స్‌ను ఎందుకు అరెస్టు చేయరు? అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. అల్లు అర్జున్ అరెస్టును ఎక్స్ వేదికగా హరీశ్ ఖండించారు. ‘సినిమా కోసం వెళ్లి తొకిసలాట జరిగి మహిళ ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. బెనిఫిట్ షోలకు అనుమతిచ్చిందెవరు? జాగ్రత్తలు తీసుకోకుండా సినిమాను ప్రదర్శించిందెవరు? కారకులు పాలకులే! చర్యలు తీసుకోవాల్సింది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పైనే!’ అని పేర్కొన్నారు. ‘ఏడాది పాలనలో రైతులను విద్యార్థులను బలిగొన్నందుకు ఎవరిని అరెస్టు చేయాలి?’ అని నిలదీశారు.